ట్రంప్‌పై ప్రతీకారం.. యుద్ధంలోకి ‘దున్నపోతు’ను లాగిన ఇరాన్‌!

  • బంగ్లాదేశ్‌లో ట్రంప్‌ పోలికలతో దున్నపోతు అంటూ వైరల్‌
  • దాన్ని షేర్‌ చేసిన రష్యాలోని ఇరాన్‌ ఎంబసీ
  • ట్రంప్‌తో పోల్చినందుకు తిండి మానేసిందంటూ సెటైర్‌
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ దేశం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ ఒక పోస్టు పెట్టింది. బంగ్లాదేశ్‌లో ట్రంప్ పోలికలతో ఉన్న ఒక తెల్ల దున్నపోతుకు సంబంధించిన వీడియోను రష్యాలోని ఇరాన్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్‌ చేసింది. ‘ట్రంప్‌తో పోల్చడం వల్ల మనస్తాపానికి గురైన ఆ మూగజీవం ప్రస్తుతం తిండి తినడం మానేసింది’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది.

బంగ్లాదేశ్‌లోని నారాయణ్‌గంజ్ జిల్లాలో 700 కిలోల బరువున్న ఈ వింత దున్నపోతు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దాని తలపై ఉన్న జుట్టు, ముఖ కవళికలు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో దీని యజమాని సరదాగా దానికి ‘డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టుకున్నాడు. రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో దీన్ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఈ బక్రీద్‌కు దాన్ని బలివ్వక తప్పదని యజమాని చెప్పడం చాలా మందిని నిరాశకు గురిచేస్తోంది.

Donald Trump
Iran
US Iran tensions
Bangladesh
Trump lookalike buffalo
Narayanganj
Bakrid
Social Media
Viral video
White Buffalo

More Telugu News